అక్కినేని అఖిల్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తిసిన రెండు సినిమాలు అంత పెద్ద విజయాన్ని అందుకోలేకపోయినా అతని ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇక అఖిల్ నటించిన రెండవ సినిమా హలో. ఈమూవీలో హీరోయిన్ గా డైరెక్టర్ ప్రియ దర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా కళ్యాణి నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు.
ఇక కళ్యాణి ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా చేస్తున్నో ఓ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా మరో హీరోతో ఛాన్స్ కొట్టేసింది కళ్యాణి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సినిమా తేజ ఐ లవ్ యూ విడుదలకు సిద్దంగా ఉంది.
ఇక తన తర్వాతి సినిమా కిషోర్ తిరుమలతో చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్ గా రితికా సింగ్ ను తీసుకున్నారు. ఇక మరో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. దాదాపు ఈసినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈవిషయంపై ఓ క్లారిటీ రానుంది. ఇక కళ్యాణి చేస్తోన్న ఈరెండు సినిమాలు విజయాలు సాధిస్తే మాత్రం రానున్న రోజుల్లో టాప్ లెవల్ కి వెళ్లి పోవడం ఖాయం అనుకుంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు.