బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో. సెక్సీ హీరోగా స్టార్ ఇమేజ్ సోంతం చేసుకున్నాడు .అయితే ఈ చాక్లెట్ బాయ్‌తో సినియర్ హీరో సంజయ్ దత్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజ్ కుమార్ ఇరాని. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
సంజయ్ జీవితంలోని డిఫరెంట్ షేడ్స్ అన్నింటినీ రెండు నిమిషాల ట్రైలర్‌నే అద్భుతంగా చూపించేశాడు డైరెక్టర్ రాజ్‌కుమార్. రణ్‌బీర్ అయితే అదరగొట్టేశాడు. ఇందులో ఎక్కడా అతను కనపించడం లేదు. డైరెక్ట్‌గా సంజయ్ దత్ వచ్చి నటించాడా అన్నంతలా ఆ క్యారెక్టర్‌లో జీవించేశాడు.
ఇక తాజాగా రిలీజైన సాంగ్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంది. డ్రగ్స్ బారిన పడి సంజయ్ ఎలాంటి దుస్థితి అనుభవించాడో ఈ కర్ హర్ మైదాన్ ఫతే అనే సాంగ్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. రణ్‌బీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సుఖ్విందర్ సింగ్, శ్రేయా ఘోషాల్ వాయిస్ సాంగ్‌కు అదనపు బలం. జూన్ 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.