స‌మంత స‌వాల్ ను స్వీక‌రించిన ఉపాస‌న..

440
upasana, samantha
- Advertisement -

కేంద్ర‌మంత్రి రాజ్య‌వ‌ర్ద‌న్ సింగ్ రాథోడ్ విసిరిన సవాల్ హామ్ ఫిట్ తో ఇండియా ఫిట్ కు దేశ వ్యాప్తంగా మంచి స్పంద‌న వ‌స్తోంది.సామాజిక మాధ్యమాలు వేదికగా తమ ఫిట్ నెస్ వీడియోలను పోస్ట్ చేయాలంటూ పలువురు ప్రముఖులకు ఆయన సవాల్ వేసిన విష‌యం తెలిసిందే. అటు క్రికెట‌ర్ల నుంచి మొద‌లుకుంటే ఇటు సినీ హీరోలు, హీరోయిన్లు కూడా ఈ సవాల్ ను స్వీక‌రిస్తూ మ‌రోక‌రికి స‌వాల్ వేస్తున్నారు. ఈసంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ స‌వాల్ ను స్వీక‌రిస్తున్నట్లు ఓ విడియో తీసి పోస్ట్ చేస్తున్నారు.

ramcharan, upasna

ఇండియా టీం కెప్టెన్ విరాట్ కోహ్లి ప్ర‌ధాని మోడీకి ఈస‌వాల్ ను విసిరిన విష‌యం తెలిసిందే. అయితే ఈస‌వాల్ పై టాలీవుడ్ లో ఎక్కువ‌గా స్పంద‌న వ‌స్తుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, క‌ళ్యాణ్ రామ్, నాగార్జున, అఖిల్, నాగ‌చైత‌న్య ప‌లువురు ఈస‌వాల్ ను స్వీక‌రించి ప‌లువురికి స‌వాల్ విసిరారు. అయితే తాజ‌గా హీరో నాగ‌చైతన్య స‌వాల్ ను స్వీక‌రించిన స‌మంత, జిమ్ లో వ్యాయామం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈసంద‌ర్భంగా హీరో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కామినేని ఈస‌వాల్ ను స్వీక‌రించింది.

అంతేకాకండా జిమ్ లో క‌స‌ర‌త్తు చేస్తున్న వీడియోను త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. స‌మంత‌కు ఉపాస‌న ఈవిధంగా పోస్ట్ చేసింది. ‘హే సమంత.. నేను విహారయాత్రలో ఉన్నప్పటికీ నీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా. నమ్రతా శిరోద్కర్, తరుణ్ తహిలియానీ, కనికా కపూర్, పింకీ రెడ్డి & అపోలో లైఫ్ స్టూడియోలోని ట్రైనర్స్ కు నేను ఛాలెంజ్ విసురుతున్నాను అని త‌న ట్వీట్ట‌ర్ లో పేర్కోంది. కేంద్ర క్రీడా శాఖ‌మంత్రి రాజ్య‌వ‌ర్ద‌న్ సింగ్ రాథోడ్ చేప‌ట్టిన ఈకార్య‌క్ర‌మానికి దేశ వ్యాప్తంగా మంచి స్పంద‌న వ‌స్తుంది.

- Advertisement -