“రంగస్థలం” సింగర్ తో “శంభో శంకర ” పాట

287
Shambo Shankara
- Advertisement -

నాన్ ‘”బాహుబలి-2′” రికార్డులు తిరగ రాసిన చిత్రం “రంగస్థలం” ఈ సినిమా కి ప్రాణంగా నిలిచిన ” రంగా రంగస్థలనా” అంటూ సాగె టైటిల్ సాంగ్ ఈ ఏడాది టాప్ వన్ గా నిలిచింది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు.ఆ తరువాత మళ్ళీ రాహుల్ సిప్లిగంజ్ శంకర్ హీరో గా రూపొందుతున్న “శంభో శంకర” చిత్రం లో ” అమ్మ అమ్మోరు” పాటను చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఎంతో అద్భుతం గా పండించారు.

Rahul Sipligunj

ఈ పాటను సోమవారం ఉదయం రేడియో మిర్చిలో హీరో శంకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శంకరతో పాటు నిర్మాతలలో ఒకరైన సురేష్ కొండేటి, రేడియో సిటీ హేమంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.”శంభో శంకర ” ద్వారా హీరో గా పరిచయం అవుతున్న శంకర్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఈ పాట సినిమా లో వస్తుంది.

ప్రముఖ గేయ రచయిత భాస్కర భట్ల రాసిన ఈ పాట లిరికల్ వీడియో సాంగ్ గా విడుదలై ఇప్పటికే ట్రేడ్ వర్గాలలో మంచి క్రేజ్ ను సంపాదించుకొంది. ఆర్.ఆర్.పిక్చర్స్ సంస్థ ఎస్.కె పిక్చర్స్ సమర్పణలో శ్రీధర్. ఎన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.రమణా రెడ్డి , సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు.. ఈ నెల మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.

- Advertisement -