రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి..!

346
rahul sipligunz
- Advertisement -

బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో రాహుల్‌పై కొంతమంది యూత్ దాడికి దిగారు. ఈ దాడిలో రాహుల్‌కు గాయాలయ్యాయి.

రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లారు. కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా..రాహుల్‌ వారిని నిలదీయడంతో వాగ్వాదం జరిగిందని సమాచారం.

దీంతో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోగా ఈ క్రమంలో రాహుల్‌ తలపై గాయాలయ్యాయి. వెంటనే ఆయనపై ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -