తెలంగాణ రాష్ట్ర నాలుగో ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధానిలో నిర్వహించిన 3కే రన్‌ను బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ప్రారంభించారు. తెలంగాణ భవన్ నుంచి ఇండియా గేట్ వే వరకు జరిగిన రన్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాల చారి,తేజావత్ రామచంద్రుతో సహా పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ ఆవరణలో ఛాయచిత్ర ప్రదర్శన,రాష్ట్ర ప్రభుత్వ పథకాల స్టాళ్లను ఏర్పాటుచేశారు.ఢిల్లీలోని వారికి రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను తెలియజేసేలా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు పథకాలపై ప్రత్యేక స్టాళ్లు పెట్టారు. హైదరబాద్ లాడ్‌బజార్ తలపించేలా ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దేశమంతటా చాటేలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆవిర్భావ సంబరాలు అదరిపోనున్నాయని వేణుగోపాల చారి చెప్పారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆఫీసులల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. స్కూల్స్ లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందు ఏర్పాట్లు చేశారు.