ఢిల్లీలో హై అలర్ట్..ఆత్మాహుతి దాడికి కుట్ర!

16
- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఉగ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని సమాచారం నేపథ్యంలో అప్రమత్తమయ్యారు.

ఆగస్టు 15 నాడే ఈ దాడి జరుగుతుందని చెప్పలేమని, పంద్రాగస్టు రెండ్రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. కథువా, దోడా, ఉధంపూర్‌, రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లో ఉగ్ర కదలికలున్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి.

కాగా జమ్మూలోని దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. అత్యాధునిక ఎం4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌లను ఆ ప్రాంతంలో గుర్తించారు.

Also Read:సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని రిలీఫ్

- Advertisement -