కార్తీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రకుల్…?

275
Karthi’s next with Rakul Preet Singh titled ‘Dev’?
- Advertisement -

విభిన్నమైన కథాంశంతో కూడిన చిత్రాలు చేస్తూ తనదైన రూట్‌లో వెళుతున్నారు తమిళ నటుడు కార్తీ. నాగార్జునతో కార్తీ నటించిన చిత్రం ‘ఊపిరి’. ఈ మూవీతో కార్తీ మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్పి అందుకుంది. ఆ తర్వాత ‘ఖాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు.

rakul-karthi

ఇక ప్రస్తుతం కొత్త దర్శకుడు రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘దేవ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇందులో కార్తీకి జోడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. గతంలో ‘ఖాకీ’ సినిమాలో వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మారోసారి కార్తీతో నటించేందుకు సిద్దమైంది రకుల్.

ప్రిన్స్ పిక్చర్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరుల ముఖ్య పాత్రలలో నటించనున్నారు.

- Advertisement -