మే 25 నుంచి కౌన్సెలింగ్..జూలై 16న క్లాసులు ప్రారంభం

239
Telangana Eamcet results declared
- Advertisement -

మే 25 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సచివాలయంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కడియం విద్యార్థుల కౌన్సిలింగ్‌ సంబంధించిన వివరాలు వారి రిజిస్టర్డ్ మొబైల్స్‌కు మేసేజ్ ద్వారా అందిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్య నాణ్యమైనదిగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.

బయోమెట్రిక్‌ విధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయని .. దేశంలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల కంటే మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 78.24 శాతం, అగ్రికల్చర్,ఫార్మసీ 90.72 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన అయ్యపు వెంకటపాణి వంశీనాథ్‌ 150.87 మార్కులతో టాప్‌ ర్యాంకర్‌గా నిలవగా గట్టు మైత్రేయ రెండో స్ధానంలో నిలిచారు.ఆంధ్రాకు చెందిన ఇద్దరు విద్యార్థులు టాప్ 10లో చోటు సంపాదించారు.

కోర్సులు,కాలేజీలను సెలక్ట్ చేసేముందు ఆయా కాలేజీల్లో ప్లేస్ మెంట్స్,ల్యాబ్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని తెలుసుకుని జాయిన్ కావాలని సూచించారు. గత సంప్రదాయానికి భిన్నంగా ఆగస్టు 1 నుంచి కాకుండా జూలై 15 నుంచే క్లాసులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

- Advertisement -