సాయిధరమ్‌తో అనుపమ రెండోసారి..

218
Anupama Parameshwaran, Sai Dharam Tej to work together again
- Advertisement -

‘ప్రేమమ్’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన అందం, అభినయంతో కుర్రకారును ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా మారి తన కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. గతంలో ‘శతమానంభవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’తో పాటు ‘కృష్ణార్జున యుద్దం’ సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది.

ప్రస్తుతం ప్రేమకథా చిత్రాల డైరెక్టర్ కరుణాకర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే మూవీలో నటిస్తుంది. ఈ సినిమకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు చిత్రయూనిట్.  ఈ ఫస్ట్ లుక్‌లో వీరిద్దరి జోడికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Anupama Parameshwaran, Sai Dharam Tej to work together again

ఇక విషయానికొస్తే కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో సాయిధరమ్ తేజ్ చేయబోయే తర్వాత చిత్రంలో నటించే ఛాన్స్‌ను కొట్టేసింది అనుపమ. వీరిద్దరి నెక్ష్ట్ మూవీలో అనుపమతో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నట్లు సమాచారం. రెండో హీరోయిన్‌గా హలో ఫేం కళ్యాణి ప్రియదర్శిన్‌ను చిత్ర నిర్మాతలు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తొంది. అనుపమ ప్రస్తుతం రవితేజతో ‘ఎవడో ఒకడు’ రామ్ సరసన ‘హలో గురు ప్రేమ కోసమే’ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది.

- Advertisement -