ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సనిమా టైటిల్ పై గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాకు అసామాన్యుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టైటిల్ పట్ల డైరెక్టర్ త్రివిక్రమ్ సంతృప్తిగా లేకపోవడంతో వేరే పేరు పరిశీలిస్తున్నాడని సమాచారం. కథను దృష్టిలో ఉంచుకుని ఈమూవీకి ‘రా రా కుమారా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది .. ఈనెల 20వ తేదిన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు ఫిలిం వర్గాల్లో చర్చ. ఈసినిమాకు యూస్ శాటిలైట్ రైట్స్ ను కూడా భారీ మొత్తంలో అమ్ముడుపోయాయి.
అజ్నాతవాసి డిజాస్టర్ కసి మీద ఉన్న త్రివిక్రమ్ ఈసినిమాతో మళ్లి హిట్ ఫాంలోకి వస్తాడని తెలుస్తుంది. ఈసినిమాలో పూజాహెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా..తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే గిప్ట్ గా అదిరిపోయే టీజర్ ను త్రివిక్రమ్ రూపొందిద్దుతున్నట్లు తెలుస్తుంది. ఈమూవీలో ఎన్టీఆర్ మరింత స్లిమ్ గా కనిపించనున్నాడు. యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవి తెరెకెక్కనుంది. ఎన్టీఆర్ మేకప్ విషయంలో కూడా ప్రత్యేక మైన శ్రద్ద తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈసినిమాను దసరాకు విడుదల చేయనునున్నారు. ఈచిత్రానికి రాథాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.