తెలుగు రీయాలిటి షోల లో అతి గ్రాండ్ గా రిలీజైన షో బిగ్ బాస్. ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ షోకు ప్రముఖ హీరో యంగ్ టైగర్ ఎన్టిఆర్ యాంకర్ గా వ్యవహరించారు. 70రోజలు జరిగిన ఈషోకు మంచి రేటింగ్స్ వచ్చాయి. యన్టీఆర్ యాంకర్ గా చేయడంతో ఈషోకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ కార్యక్రమంతో స్టార్ మా రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. అయితే బిగ్ బాస్ సెంకడ్ సీజన్ ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. గతంలో ఈ షో ముంబాయ్ లో జరగగా..ఈ సారి మాత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్టింగ్ వేసినట్టు సమాచారం.
అయితే ఈ పోలో పాల్గోనడానికి పలువురు సెలబ్రీటిలను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారట బిగ్ బాస్ టీం. అయితే ఇటివలే ఒక సింగర్ ను సంప్రదించారట… ఆ సింగర్ ఎవరో కాదు గీతామాధురి.. అందుకే ఆమె ఒకే చెప్పినట్టు తెలిపారు బిగ్ బాస్ టీం. ఇందుకోసం కొంత మంది ప్రముఖులను సెలక్ట్ చేశారు. త్వరలోనే ఈ షోను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే గతలో ఈషోకు యంకర్ గా ఎన్టీఆర్ చేశాడు. ఈసారి యాంకర్ గా న్యాచురల్ స్టార్ నాని చేయనున్నాడు. ఈ షో లో పాల్గోనే వారిలో సింగర్ గీతామాధురి, నటి తేజస్విని మడివాడ, హీరో తరుణ్ లు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ షోకు సంబంధించి ప్రోమో ను కూడా తీసే పనిలో ఉన్నారు బిగ్ బాస్ టీం. గతంలో 12మంది సెలబ్రిటిలతో జరిపిన ఈ షోను ఈసారి ఎంత మంది గెస్ట్ గా వస్తారో చూడాలి