శర్వానంద్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల..

225
Sharwanand to work with Srikanth Addala
- Advertisement -

మహేష్‌ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్రోత్సవం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకోవటంతో కష్టాల్లో పడ్డాడు శ్రీకాంత్. గతంలో ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Sharwanand to work with Srikanth Addala

బ్రహ్మోత్సవం చిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఎవరితోనూ సినిమా చేయలేదు. ఈ సినిమా ఫ్లాప్‌తో  శ్రీకాంత్‌తో సినిమాకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లాంగ్ గ్యాప్ ఏర్పడిందని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం మళ్లీ అన్నదమ్ముల కథాంశంతో గీతా ఆర్ట్స్‌సంస్థ ఈయనతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్దంగా ఉందని తెలుస్తోంది.

ఇందులో హీరోగా శర్వానంద్ నటిస్తుండగా మరో హీరో ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు శ్రీకాంత్. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న ఈ సినిమాను విజయం చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడట. ప్రస్తుతం శర్వానంద్ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణ్ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -