ప్రతిసారి ఐపీఎల్లో కొందరు ఆటగాళ్లు ఊహకందని రీతిలో ఫిల్డింగ్, బ్యాటింగ్‌లతో అభిమానులను అలరిస్తుంటారు. ఈ ఐపీఎల్లో కూడా అదే జోరు కొనసాగుతుంది. నిన్న రాజస్థాన్, కింగ్స్ ఎలెవన్ జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ పట్టిన క్యాచ్‌కి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ముందుగా బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ 11 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం కొద్ది సేపటికి సంజూ శాంసన్ ఔటైన తర్వాత బెన్ స్టోక్స్ బ్యాటింగ్‌కు దిగాడు.
ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ 9 బంతుల్లో 12 పరుగులు చేశాడు. 13వ ఓవర్లో ముజీబ్ వేసిన చివరి బంతిని కూడా భారీ షాట్ బాదాడు. అయితే లాంగ్ ఫీల్డింగ్‌లో ఉన్న మయాంక్… స్టోక్ అందించిన క్యాచ్‌ని కల్లు చెదిరే రీతిలో పట్టి అందరిని ఆశ్చర్యపరిచి ఔరా అనిపించాడు. సిక్స్ అనుకున్న తరుణంలో మయాంక్ క్యాచ్ అందుకుని.. బ్యాలెన్స్ కంట్రోల్ కాకపోవడంతో అక్కడే ఫిల్డింగ్‌లో ఉన్న మనోజ్ తివారీకి బంతిని విసిరి బెన్ స్టోక్స్‌ని మైదానం వీడేలా చేశారు. మయాంక్ పట్టిన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిన్నటి మ్యాచ్‌లో రాజస్థాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (84నాటౌట్; 54బంతుల్లో 7×4, 3×6) చివరి వరకూ నిలిచి ఒంట్టి చేత్తో మ్యాచ్‌ని గెలిపించాడు. ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న రాజస్థాన్‌కి నిన్నటి ఓటమితో ప్లేఆఫ్ ఆశలు దాదాపు దూరమైనట్లే.