దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ చిల్లర రాజకీయాల కోసం,2019 ఎన్నికల కోసం కాదని తెలిపారు సీఎం కేసీఆర్. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ హైదరాబాద్ వచ్చారని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అఖిలేష్‌కు ఇస్తున్నాని తెలిపారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. భారతదేశ రాజకీయాల్లో సమూల మార్పు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలనే నేరవేర్చడంలో కాంగ్రెస్,బీజేపీ విఫలమయ్యాయని తెలిపారు. సమాజంలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానిన తెలిపారు. జాతీయ రాజకీయాల్లో తాము స్థాపించబోయే ఫ్రంట్‌కు ఎలాంటి పేరు పెట్టవద్దని జర్నలిస్టులకు సూచించారు సీఎం. దేశంలో ఏ వర్గం కూడా సంతోషలంగా లేదన్నారు. వెనుకబడ్డ చైనా…నేడు ప్రగతిలో ముందంజలో ఉందని….భారతదేశం ఎందుకు వెనుకబడాలని ప్రశ్నించారు.
అఖిలేష్‌తో చాలా విషయాలు చర్చించానని తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చినందుకు అఖిలేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్ధాయిలో తాము ఏర్పాటుచేయబోయే ఫ్రంట్‌కు సంపూర్ణ మద్దతిస్తానని తెలిపారు.