- Advertisement -
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 113 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో 74 పోస్టులు(42 ఏఈఈ, 32 జూనియర్ అసిస్టెంట్స్), ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుల పరిధిలో 30 పోస్టులు(17 జూ. అసిస్టెంట్స్, 13 జూ. అసిస్టెంట్ టైపిస్టులు), చక్కెర సంచాలకుల పరిధిలో 6 పోస్టులు(5 జూ. అసిస్టెంట్స్, ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్), సహకార కమిషనర్ పరిధిలో 3 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
- Advertisement -

