ఏప్రిల్ 29న సోనం కపూర్ పెళ్లి…

315
Sonam kapoor Marriage April 29 in Mumbai
- Advertisement -

కపూర్ ఫ్యామిలీకి చెందిన సోనమ్ కపూర్ త్వరలో ఓ ఇంటి ఇల్లాలి అవుతున్నట్లు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా అనే యువకుడితో కొంతకాలం నుంచి ప్రమాయణం నడిపిస్తున్నట్లు సమాచారం. జెనీవా వేదికగా మే 8 లేదా 12 తేదీల్లో వీళ్లిద్దరి పెళ్లి జరగనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తండ్రి అనీల్ కపూర్ ప్రత్యేకంగా అతిథులకు ఫోన్ చేసి ఆహ్వానించారని. అతిథులకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేశారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఈ నెల 29న ముంబైలో సోనమ్, ఆనంద్ అహుజాల పెళ్లి జరగనున్నల్లు తెలుస్తుంది. ఈ వేడుకకి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరు కానున్నున్నారు.పెళ్ళికి రెండు రోజుల ముందు సంగీత్, మెహందీ సెర్మ‌నీలు ఏర్పాటు చేయ‌నున్నార‌ని సమాచారం.

Sonam kapoor Marriage April 29 in Mumbai

బోనీకపూర్ భార్య శ్రీదేవి మరణంతో కపూర్స్ ఫ్యామిలీలో కొన్నాళ్లుగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ విషాద చాయల నుంచి కపూర్స్ ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. కపూర్స్ ఫ్యామిలీలో సోనమ్ పెళ్లి వార్త వినగానే అటు అభిమానులలో, ఇటు కపూర్స్ ఫ్యామిలీలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎప్పటి నుంచో సోనమ్, ఆనంద్ ప్రేమ వ్యవహారంపై మీడియా , అభిమానులు చెబుతున్నప్పటికి దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పుడు వస్తున్న పెళ్లి వార్తలకైనా.. కపూర్స్ ఫ్యామిలీ స్పందిస్తుందో లేదో చూడాలి మరీ. ప్ర‌స్తుతం వీరే ది వెడ్డింగ్‌, సంజూ ఏక్‌ లడకీకో దేఖాతో ఐసా లగా సినిమాలతో అమ్మడు బిజీగా ఉంది. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్‌లో గెస్ట్ రోెల్ చేయనుంది సోన‌మ్.

- Advertisement -