భరత్ టీంకు… ఐ ఫోన్ కానుకలు ఇచ్చిన మహేష్

251
surprises his team with Cozy Gifts Of Mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ నెల 20న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ట్రైలర్ , సాంగ్స్ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవలె ఈ సినిమా ఆడియో భారీ స్థాయిలో వేడుక జరిగినప్పటినుంచి ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ అభిమానులు భరత్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారట.surprises his team with Cozy Gifts Of Mahesh babu

మహేష్ రెండు పరాజయాల తర్వాత వస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ మూవీ మహేష్‎కి ఖచ్చితంగా విజయం అందించాల్సిన చిత్రం. కావున మహేష్ ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల మహేష్ పూర్తి సంతృప్తిగా ఉన్నాడట. ఈ సినిమా కోసం కష్టపడి.. మంచి అవుట్ పుట్ అందించిన డైరెక్షన్ టీమ్‎ను అభినందించారట మహేష్. అంతేకాకుండా ఆ టీమ్ మొత్తానికి ఐ ఫోన్ X కానుకలుగా ఇచ్చాడట. గతంలో కొరటాల శివ శ్రీమంతుడు ఇచ్చిన హిట్‎కు కానుకగా ఖరీదైన కారును కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆయన దర్శకత్వంలో చేస్తున్న ద్వితీయ చిత్రం భరత్ అనే నేను కూడా మంచి హిట్ అయితే కొరటాల శివకు మహేష్ ఏం కానుకగా ఇస్తాడో చూడాలి మరీ.

- Advertisement -