రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలోని చెన్నై అంటే ఐపీఎల్ ఫేవరెట్. తమ ఆటతీరు ముఖ్యంగా కెప్టెన్ కూల్ ధోని ఒత్తిడిలోనూ తీసుకునే నిర్ణయాలు..ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయి. ఈ నేపథ్యంలో రీఎంట్రీతో అదరగొట్టేందుకు సిద్దమవుతోంది చెన్నై సూపర్ కింగ్స్.
ఈ నేపథ్యంలో కెప్టెన్ కూల్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రాంఛైజీ నిర్వాహకులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన ధోని…తిరిగి సొంత జట్టుకు ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. నిషేధం కారణంగా రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరపున ఆడిన ఏదో ఫీలింగ్ ఉండేదన్నాడు.
ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితమైందని చెప్పుకొచ్చాడు. తిరిగి పసుపు రంగు జెర్సీ ధరించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 89 మ్యాచ్‌లు ఆడిన నేను చెన్నై తరఫున ఎనిమిదేళ్లలో 159 మ్యాచ్‌లు ఆడానని గుర్తుచేశాడు.
ఏప్రిల్ 7న ఐపీఎల్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ముంబైతో తలపడనుంది చెన్నై. చెన్నైతో పాటు రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
https://twitter.com/CSK_World/status/979203718657667072