మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భరత్ అనే నేను’. ది విజన్ ఆఫ్ భరత్ పేరిట విడుదలైన టీజర్ టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే పది మిలియన్ డిజిటల్ వ్యూస్‌తో అరుదైన ఘనతను సొంతం చేసుకోగా తాజాగా మహేష్ మరో మైలురాయి చేరుకున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఓ సినిమా టీజర్‌కు ఎక్కువ లైక్‌లు వచ్చిన సినిమాకు రికార్డు సృష్టించింది. 5 లక్షల 30 వేల మంది ఈ టీజర్‌ను లైక్ చేయగా కోటీ 33 లక్షల మంది ఇప్పటివరకు ఈ వీడియోని చూశారు.
టీజర్లో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనబడుతూ, తనదైన శైలిలో చెబుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి. ప్రతి పౌరుడికి భయం బాధ్యత ఉన్నప్పుడే దేశం బాగుంటుంది అన్న మెసేజ్‌తో ఈ మధ్య కాలంలో ఏ తెలుగు హీరో కనిపించంత స్టైలిష్ చీఫ్ మినిస్టర్‌గా మహేష్ లుక్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. కొరటాల శివ తన మార్క్‌తో మరోసారి మాయ చేస్తాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇక ఈ సినిమా రైట్స్ కూడా అంతే భారీ స్ధాయి ధర పలుకుతుండటం విశేషం. హిందీ ఆల్ రైట్స్ 13 కోట్లకి అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్ ను 18 నుంచి 20 కోట్లకు దక్కించుకోవడానికి రెండు భారీ సంస్థలు పోటీ పడుతున్నాయట. మొత్తంగా విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తున్న మహేష్ భరత్ అను నేను విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులను చెరిపేస్తుందో చూడాలి.