సవ్యసాచి..ఫస్ట్ లుక్

247
Savyasachi First Look
- Advertisement -

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం “సవ్యసాచి” . చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతోంది. మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండగా.. జూన్‌ 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. థ్రిల్లర్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. సవ్యసాచి అంటే రెండు చేతులని సమర్ధవంతంగా,శక్తివంతంగా వాడే వాళ్లని అర్ధం. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో చైతూ సీరియస్‌ లుక్‌లో కనిపిస్తుండగా పది చేతులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఫస్ట్ లుక్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో సంకేతాలను ఇచ్చేశారు. బాహుబలి ఫేం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పిటి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.

- Advertisement -