రిక్షా తొక్కుతున్న.. మైనింగ్‌ కింగ్‌

261
women’s day post by Gali Janardhan Reddy going viral
- Advertisement -

మైనింగ్ కింగ్,కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన వార్తల్లోకి వచ్చారంటే కోర్టు కేసుకు సంబంధించో,అక్రమ మైనింగ్ కేసుల గురించో కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్య అరుణకు మరచిపోలేని అనుభూతినిచ్చారు.

గురువారంబెంగళూరులోని తన నివాసం పారిజాత అపార్ట్‌మెంట్‌ గాలి సందడిచేశారు. పూలతో అలంకరించిన సైకిల్‌ రిక్షాపై తన సతీమణి అరుణను కూర్చోబెట్టుకొని తొక్కూతు సతీసేవ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక తల్లిగా, భార్యగా, సోదరిగా, కుమార్తెగా ఎన్నో రూపాల్లో స్త్రీ మనకు సేవలు చేస్తుంది,భూమి మీద అత్యంత అందమైన సృష్టి స్త్రీ అని ట్వీట్ చేసిన గాలి ఎక్కడ దేవతలు గౌరవింపబడతారో అక్కడే దేవతలు సంచరిస్తారంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -