అతిలోక సుందరిగా కోట్లాదిమంది హృదయాలలో చోటు సంపాదించుకున్న ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఎంతో ఆరోగ్యంగా కనిపించే శ్రీదేవి గుండెపోటుతో మరణించిందన్న వార్త… అందరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా ఆమెను అన్నింటికన్నా ఎక్కువగా అభిమానించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమె మరణం పట్ల తీవ్ర కలత చెందారు.
‘‘నిజంగా శ్రీదేవి చనిపోయారా? నన్ను ఎవరైనా నిద్ర లేపి ఇదొక చెడ్డ కల అని చెప్పండి’’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ‘‘ఆమె ఇప్పుడే అలా వెళ్లిపోవడం ఎంత నరకంగా ఉంటుందో ఎవరైనా చెప్పండి’’ అంటూ తను శ్రీదేవితో ఉన్న ఫోటోను షేర్ చేశారు వర్మ. అంతకు ముందొక ట్వీట్‌లో ‘‘నేను ఈరోజులా భగవంతున్ని ముందెన్నడూ అసహ్యించుకోలేదు. నా జీవితంలో అత్యంత పెద్ద వెలుగుని అతను తీసుకెళ్లిపోయాడు. బోనీ కపూర్‌కి నా ప్రగాఢ సానుభూతి’’ అని ట్వీట్ చేశారు.
Can somebody tell me how in hell can she just go away like that??? pic.twitter.com/CQkp00z60Y
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018
I HATE GOD FOR KILLING SRIDEVI and I HATE SRIDEVI FOR DYING and here is the reason https://t.co/hsxyNeOmRR
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018