సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు,అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కేక్ కటింగ్‌లు,అన్నదానాలు,దేవాలయాల్లో ప్రత్యేక పూజలు,రోగులకు పండ్లు,వికలాంగులకు ట్రై సైకిళ్లు,మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఇక పలువురు ప్రముఖులు కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సూక్ష్మ కళాకారుడు డాక్టర్ ముంజంపల్లి విద్యాధర్ సూది రంధ్రంలో ఇమిడే ఆయన బంగారు విగ్రహాన్ని తయారుచేశారు. నగరంలోని హస్తినాపురంనకు చెందిన విద్యాధర్ 14 మిల్లీ గ్రాముల బంగారంతో వారం రోజులు శ్రమించి సూది రంధ్రంలో ఇమిడే కేసీఆర్ బంగారు విగ్రహాన్ని రూపొందించారు.
గతంలో తల వెంట్రుకపై ‘జై కేసీఆర్… జై తెలంగాణ’ అని రాసి కేసీఆర్‌కు బహూకరించి ఆయన ప్రశంసలు అందుకున్నారు విద్యాధర్. ఇక హైదరాబాద్ లోని జలవిహార్‌లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడులకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.