కణం..వాయిదా పడింది

301
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య,ఫిదా ఫేమ్ సాయిప‌ల్ల‌వి జంటగా నటించిన సినిమా కణం. ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కట్స్ ఏమీ లేకుండా U/A సర్టిఫికేట్ పొందింది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మూవీని వచ్చే నెల 3కి వాయిదా వేశారు.

Naga Shourya Kanam Movie First Look ULTRA HD Posters WallPapers | Sai Pallavi

ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ అందరిని ఆకట్టుకుంది. వీరిద్దరి పెళ్లి సీన్‌తో ట్రైలర్ మొద‌ల‌వుతుంది. కృష్ణ నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నువ్వు నమ్మలేకపోవచ్చు. కానీ అది నిజం.. నువ్వు అన్ని మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను’ అంటూ సాయిపల్లవి త‌న సొంత గొంతుతో డైలాగ్స్ చెప్పింది. ఎవరో హత్యకు గురి కావడం, హంతకుడి కోసం పోలీసులు గాలింపు, క్షుద్ర పూజలు చేయడం.. తదితర సన్నివేశాలతో విడుద‌లైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం ఛలో సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న నాగశౌర్య ..బేబి షామిలితో అమ్మమ్మ గారిల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

- Advertisement -