- Advertisement -
గత కొన్ని రోజులుగా సరైన అవకాశాలు లేక అల్లాడిపోతోంది ముద్దుగుమ్మ కాజల్.ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చాన్స్ కొట్టేయడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది అమ్మడు. అదే సమయంలో బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం కూడా దక్కింది. షాహిద్ కపూర్ సరసన నటించేందుకు ఎంపికైంది.
ఈ సినిమా కథా చర్చల సమయంలోనే షాహిద్‌తో కాజల్ కి విపరీతమైన చనువు ఏర్పడిందట. ఆ సందర్భంగా తన లగ్జరీ కారును షాహిద్ విపరీతంగా వాడుకున్నాడట. అయితే చివరికి సినిమా తెరకెక్కుండా కథా చర్చల సమయంలోనే బ్రేక్ పడిందట. సినిమా ఆగిపోయన తర్వాత షాహిద్ కూడా సడెన్‌గా కాజల్ తో మాట్లాడడం మానేశాడట. కనీసం మళ్లీ షాహిద్ ఫోన్ కూడా చేయలేదంటూ స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోంది కాజల్. అయితే పెళ్లైన ఈ హీరో తనను దూరపెడితే కాజల్ అంతగా ఎందుకు బాదపడుతుందో అర్థం కావడంలేదు.
- Advertisement -