రానాకు వెంకి వాయిస్ ఓవర్

198
- Advertisement -

విక్టరీ వెంకటేష్ కొత్త అవతారం ఎత్తేందుకు తయారవుతున్నాడు. తాజాగా అబ్బాయ్‌ రానా ఘాజీ చిత్రానికి బాబాయ్‌ వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌
ఇస్తుండడం ఫిల్‌‌మనగర్‌లో చర్చనీయాంశ మైంది. ఇటీవల బాహుబలి 2 షూటింగ్ ముగించుకుని రానా రీసెంట్ గానే మిగతా ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు.ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఘాజీ చిత్రంతో పాటు తేజ దర్శకత్వంలో మరో చిత్రంలో రానా నటిస్తున్నాడు.

1971లో ఇండో-పాక్‌ యుద్ధ సమయంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీస్తున్న ఘాజీలో రానా నౌకాదళ అధికారిగా కనిపించనున్నారు. తాప్సీ కథానాయిక. ఈ చిత్రంలో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు వెంకటేశ్‌ను సంప్రదించారట చిత్ర బృందం. అన్న సురేశ్‌బాబు కొడుకు హీరో కావడం, కథ కూడా నచ్చడంతో వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నది ఫిలిమ్‌నగర్‌ టాక్‌. అటు నాగచైతన్య ప్రేమమ్‌కి నాగార్జున కూడా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. మొత్తానికి దగ్గుబాటి,అక్కినేని కుర్ర హీరోల కోసం స్వయంగా ఫ్యామిలీ హీరోలే రంగంలోకి దిగుతున్నారన్న మాట.

- Advertisement -