- Advertisement -
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దినకరన్ ఓ ‘420’ అని, చెబుతున్నవన్నీ అబద్ధాలే అని దినకరన్ పై మాటలతో విరుచుకుపడ్డారు పన్నీర్ సెల్వం. అంతేకాకుండా తానొక 420 అనే విషయాన్ని స్వయంగా ఆయనే తమతో చెప్పారని అన్నారు.
ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ మేనల్లుడైన దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన దినకరన్ విజయానంతరం అన్నాడీఎంకేపై దినకరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఓపీఎస్, ఈపీఎస్ వర్గీయుల్లో కొందరు దినకరన్ వర్గంలోకి చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
- Advertisement -