అటోమోబైల్ పెట్టుబడులకు అనుకూలం..

204
KTR Addressed SIAM Executive Committee Meeting
- Advertisement -

హైదరాబాద్‌లో జరుగుతున్న సోసైటీ అఫ్ అటో మోబైల్ మ్యానుఫాక్ఛరర్స్ అసోషియేషన్( సియామ్) కార్యనిర్వాహక సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ప్రసంగించారు. అటో కంపోనెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ అసోషియేషన్( అక్మా) ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గోన్నారు. తెలంగాణ రాష్ర్టంలో అటోమోబైల్ రంగ పెట్టుబడులకున్న అవకాశాలను వివరించిన మంత్రి, గత మూడు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, అకర్షించిన భారీ పెట్టుబడులు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి మంత్రి సియామ్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న విద్యుత్ సంక్షోభం నుంచి ప్రస్తుతం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న తీరుని మంత్రి తెలిపారు.

రాష్ర్టంలో పరిశ్రమలకు అవసరం అయిన భూమి, నీరు, విద్యుత్ సరఫరాకు ఏలాంటి కొరత లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాన్యూఫాక్చరింగ్( తయారీ రంగానికి)కు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి, రాష్ర్టంలో అటోమోబైల్ రంగ పెట్టుబడులకు సంపూర్ణ సహాకారంతో స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వమే అటోమోబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఖర్చుతో టాస్క్ ద్వారా శిక్షణ ఇచ్చి అవసరం అయిన మానవ వనరులను మంత్రి కంపెనీలకు హమీ ఇచ్చారు. ఇప్పటికే అటోమోబైల్ రంగ ఈకో సిస్టమ్ తెలంగాణలో అటోమోబైల్ పెట్టుబడులకు అనూకూలంగా ఉందని తెలిపారు.

KTR Addressed SIAM Executive Committee Meeting

రాష్ర్టంలో అటోమోబైల్ యాన్సిలియరీ కంపెనీలు ఉన్నాయని, ఇప్పటికే ఏంఅర్ యఫ్, మహీంద్రా వంటి కంపెనీలు, జడ్ యఫ్ వంటి అంతర్జాతీయ సంస్ధలు తెలంగాణ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అటోమోబైల్ రంగ పెట్టుబడులకు కావాల్సిన అన్ని రకాల సహాకారాలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో ముందంజలో ఉండేందుకు మోబిలీటీ రీసెర్చీ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. అటోమోబైల్ రంగ అభివృద్దికి ఊతం ఇచ్చేందుకు అవసరం అయిన విధాన రూపకల్పనలో సియామ్, అక్మా సంస్ధలతో కలసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

నగరలోని బిర్యానీ, అతిధ్యం బాగుందని, అంతకు మించి తెలంగాణ పాలసీలు మరింత బాగున్నాయని సియామ్ ప్రతినిధులు అన్నారు. దేశంలో 28 మిలియన్ వాహనాలు తయారవుతున్నాయని, ఇందులో 25 లక్షల వాహానాలు స్ధానికంగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఈ రంగంలో మరింత పెరుగుదలకు అవకాశం ఉందని సియామ్ ప్రతినిధులు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రం అందిస్తున్న పాలసీ మద్దుతుతో అటోమైబైల్ రంగంలో దేశ వ్యాప్తంగా కొన్ని తయరీ కేంద్రాలు( మ్యాన్యూఫాక్చరింగ్ హబ్స్) ఏర్పడ్డాయని తెలిపారు. తెలంగాణను ఒక డైనమిక్ స్టేట్ గా చూస్తున్నామని మంత్రికి తెలిపారు.

తెలంగాణ పాలసీలను తాము ఇప్పటికే గుర్తించామని, పెట్టుబడులకు ఊతం అందిస్తున్న తీరు, మద్దతుపైన మంత్రికి అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ది రేటును ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణలో ఉన్న మానవ వనరులు, ఇతర మౌళిక వసతులు అటోమైబైల్ రంగ అభివృద్దికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఏలక్ట్రిక్ మోబిలిటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను వారు అభినందించారు. పాలసీల రూపల్పనలో రాష్ర్ట ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. రానున్న ఏలక్ర్టిక్ మోబిలీటీ రంగ అవకాశాలపైన సియామ్ అశావాహంగ ఉన్నదని, ఈ ప్రయత్నాలకు ప్రభుత్వాల పాలసీ మద్దతు కోరుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో క్లీన్ టెక్నాలజీ అధారిత ఏలక్ర్టికల్, హైబ్రిడ్ వాహనాలదే కాలమని మంత్రికి సియామ్ ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -