‘పెళ్ళిచూపులు’ తర్వాత పస్తుతం “మెంటల్ మదిలో” చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్ ప్రధాన తారాగణం. ప్రశాంత్ విహారి : సంగీతం, వెదరామన్ : కెమెరా, విప్లవ్ : ఎడిటింగ్. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
అయితే పెళ్ళిచూపులు సినిమాలో కంటెంట్ ఉందని గుర్తించిన సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్.. ఈ చిత్రాన్ని తన బేనర్ మీద రిలీజ్ చేశాడు. ఆ చిత్రానికి విడుదలకు ముందు ప్రచారం బాగా చేసి.. ముందే సినిమా వాళ్లకు.. ప్రెస్ వాళ్లకు ప్రివ్యూ వేసి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చూశాడు సురేష్. ఇప్పుడు ఇదే తరహాలో ‘మెంటల్ మదిలో’ అనే సినిమాను టేకప్ చేసిన సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే.. ‘పెళ్లిచూపులు’ తరహాలోనే దీనికి కూడా రిలీజ్ కంటే ముందు పాజిటివ్ టాక్ వచ్చేస్తోంది.
అయితే రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఈ చిత్రానికి వరుస బెట్టి ప్రివ్యూలు వేస్తున్నారు. కొన్ని రోజులుగా టాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా దీనికి రివ్యూలిస్తున్నారు. అందరూ ఈ చిత్రాన్ని పొగిడేస్తున్న వాళ్లే. యువ కథానాయకుడు రామ్ కూడా అందులో ఒకడు. ప్రెస్ వాళ్లకు కూడా రెండు రోజుల ముందే ప్రివ్యూ వేస్తారట. మొత్తానికి ‘పెళ్లిచూపులు’ తరహాలోనే ముందే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి మంచి బజ్ మధ్య రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.