ఎస్ ఫర్ శర్వానంద్.. ఎస్ ఫర్ షాలినీ పాండే. ఈ ఎస్ అండ్ ఎస్కి జోడీ కుదిరిందని టాక్. సూపర్ సక్సెస్‌లతో దూసుకెళుతున్నారు శర్వా. ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చేసుకున్నారు షాలినీ పాండే. ‘స్వామి రారా’ వంటి హిట్ మూవీతో దర్శకుడిగా మార్కులు కొట్టేసి, ‘దోచెయ్’, ‘కేశవ’లతో గ్రాఫ్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. శర్వానంద్ సినిమాల్లో ఎక్కువగా సింగిల్ హీరోయిన్ ఉంటుంది. ఈ హీరో ఇద్దరితో రొమాన్స్ చేసిన దాఖలాల్లేవ్. అందుకే ఫస్ట్ టైం శర్వాకు ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఫిక్స్ చేసినట్టున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ.
ఒక హీరోయిన్ గా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండేను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ గా నివేత థామస్ ను అనుకుంటున్నారు. వీళ్లిద్దరికీ శర్వానంద్ తో ఇదే ఫస్ట్ మూవీ. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది. వరుసగా ఎంటర్ టైనింగ్ కథల్నే సెలక్ట్ చేసుకుంటూ వస్తున్న శర్వానంద్ ఈ సినిమాతో మరోసారి తన పాత జానర్ లోకి వెళ్తున్నాడు.