క్వీన్‌ రీమేక్‌లో కొత్త ట్విస్ట్‌

264
Four-Queens-to
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా రానౌత్ న‌టించిన క్విన్ మూవీని ద‌క్షిణాది నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు.. హిందీలో కంగనా ర‌నౌత్ పోషించిన పాత్ర‌ని తెలుగులో త‌మ‌న్నా, త‌మిళంలో కాజ‌ల్‌, మ‌ల‌యాళంలో మంజిమా మోహ‌న్‌, క‌న్న‌డ‌లో ప‌రుల్ యాద‌వ్‌లు పోషిస్తున్నారు. నాలుగు భాష‌ల‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఫ్రాన్స్‌లోని ఒకే ప్రాంతంలో జ‌రుగుతుంది. దీంతో నాలుగు భాష‌ల చిత్ర యూనిట్స్ తో పాటు హీరోయిన్స్ అక్క‌డే ఉంటున్నారు.

Queen Remake Will Bring Together Four Actresses In France

నాలుగు భాష‌ల షూటింగ్ ఒకే చోట షూటింగ్ జ‌ర‌గ‌డంపై కాజ‌ల్ స్పందిస్తూ.. ఒకే సారి కెరీర్ స్టార్ట్ చేసిన మా అంద‌రి మ‌ధ్య చ‌క్క‌ని రిలేష‌న్ ఉంది. ఇండ‌స్ట్రీలోని నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో త‌మన్నా ఒక‌రు. ఒకే ప్రాంతంలో ఉండనుండడంతో మా రిలేషన్ మరింతగా బలపడుతుంది’ అంటోంది తమన్నా. షూటింగ్ కోసం ఇలా అంద‌రం ఒకే చోట ఉండాల్సి రావ‌డం జ‌రుగుతోంది అని కాజ‌ల్ పేర్కొంది. నెల‌కు పైగా జ‌ర‌గ‌నున్న ఫ్రాన్స్ షెడ్యూల్‌లో మేమంద‌రం చాలా ఎంజాయ్ చేస్తామని చెబుతుంది మంజిమా మోహ‌న్‌.

- Advertisement -