‘దేవదాస్’ మూవీతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన బ్యూటీ ఇలియానా. అయితే ఇల్లీ టాలీవుడ్ కి దూరమై చాలా రోజులే అయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి జంప్ అయిన ఇలియానా అక్కడ నిలదొక్కుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసేస్తోంది.
తాజాగా అజయ్ దేవగణ్ సరసన నటిస్తున్న ‘బాద్షాహో’ సినిమాలో స్కిన్ షో కూడా చేసింది ఈ అమ్మడు. అంతేకాకుండా ఓ పాటలో ఆమె టాప్ లెస్ గా కూడా కనిపించింది. ఆ సన్నివేశాన్ని దర్శకనిర్మాతలు ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
అయితే ఈ టాప్ లెస్ స్కిన్ షోపై ఇల్లీ స్పందించింది. పాట చివర్లో జాకెట్ ను జారవిడిచే సన్నివేశం ఉంటుందని… అలా టాప్ లెస్ గా కనిపించాలనే ఆలోచన తనదేనని చెప్పింది. నటీనటుల మధ్య పరస్పర నమ్మకానికి ఈ సన్నివేశం ఒక ఉదాహరణ అని చెప్పింది.
అంతేకాకుండా..షూటింగ్ సమయంలో తాను టాప్ లెస్ గా ఉన్నప్పుడు, మరొకరు తనకు జాకెట్ అందించేంత వరకు అజయ్ దేవగణ్ తనను రక్షణ కవచంలా కవర్ చేశాడని తెలిపింది.