‘మన్మథ’,‘వల్లభ’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిన హీరో శింబు ఇప్పుడు ‘సరసుడు’గా వస్తున్నాడు. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై టి.రాజేందర్ నిర్మించిన చిత్రం ‘సరసుడు’.
ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్. కురళఅరసన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో 5 పాటలు ఉండగా.. అన్ని పాటలను కెనడాలో కంపోజ్ చేశారు. అయితే శింబు, నయనతారలు ఎంత ఘాటైన ప్రేమికులో వివరించనక్కర్లేదు. ఇదంతా ఒకప్పుడు లెండి. ఎలా పడ్డారో కానీ ప్రేమలో పడి.. తెగ ప్రేమించేసుకున్నారు. ముద్దులు పెట్టుకుని, ఫొటోలు దిగి.. అవి మీడియా వరకూ వచ్చేంతగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ వేరుపడ్డారు. బ్రేకప్ అనుకుని.. విడిపోయారు. శింబుతో బ్రేకప్ తర్వాత నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లి ఆగింది. ఆ తర్వాత అతడితో బ్రేకప్.. ఆపై దర్శకుడు విఘ్నేష్ తో ఆమె ప్రేమలో ఉన్నారిప్పుడు. బ్రేకప్ తర్వాత, నయనతార-శింబు కాంబోలో వచ్చిన సినిమానే ‘ఇదు నమ్మ ఆళు’. తమిళంలో ఏడాది కిందటే విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి అనువాదమై విడుదల కానుంది.