కత్రీనా కైఫ్.. పేరుకు బాలీవుడ్ నటీమణే అయినా.. తెలుగునాట మాత్రం ఈ ముద్దుగుమ్మ కు బాగానే పాపులారిటీ ఉంది. ఈమె కెరీర్ ఆరంభంలో చేసింది తెలుగు సినిమాలే. హిందీ చిత్రపరిశ్రమ ఈమెను ఆదరించని రోజుల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు లభించాయి. బాలయ్య, వెంకటేష్ వంటి హీరోల సరసన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు పుంజుకున్నాయి. ఆ తర్వాత తెలుగు పరిశ్రమకు అందనంత ఎత్తుకు ఎదిగింది కత్రినా. ఇప్పుడు టాలీవుడ్ లో ఈమె ను నటింపజేయడం అంత ఈజీ వ్యవహారం కాదు. ఎందుకంటే.. అన్ని కోట్లు ఇచ్చి ఈమెను తెచ్చుకోవడం సాధ్యం అయ్యే పనిలా లేదు.
అయితే గత కొంత కాలంగా కత్రినా కైఫ్ బాలీవుడ్లో ఎంత కష్టపడుతున్నా సరైన హిట్ దక్కడం లేదు. దాదాపు స్టార్ హీరోస్ అందరితో ఆడిపాడిన ఈ అమ్మడు ఎన్ని ప్రయోగాలు చేసిన ఈ మధ్య ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు. అయినా సరే ఛాన్సులను మాత్రం బాగానే దక్కించుకుంటోంది. ఇప్పుడు మరో మంచి ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి ఎన్టీఆర్ టెంపర్ ని రణవీర్ సింగ్ తో రీమేక్ చెయ్యాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడట. అయితే ప్రస్తుతం గోల్ మాల్ రిటర్న్స్ సినిమాతో బిజీగా ఉండడంతో ఆ సినిమా అయిపోగానే టెంపర్ రీమేక్ లో కత్రినని హీరోయిన్ గా సెలక్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఆమె ఒప్పుకుంటే వెంటనే రణవీర్ తో జోడికట్టించి సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కత్రినా కెరీర్ కూడా కొంత కష్టకాలంలోనే ఉంది. సినిమాలేవీ హిట్ కాలేదు, అలాగే ప్రియుడు రణ్ బిర్ కపూర్ విడిచి వెళ్లిపోయాడు.. ఈ నేపథ్యంలో కత్రినా కు హిట్ అత్యవసరం. టెంపర్ రీమేక్ తో ఈమె దశ మళ్లీ తిరుగుతుందో లేదో చూడాలి..