కొత్త మూవీ స్టార్ట్‌ చేసిన కల్యాణ్‌రామ్‌….

344
- Advertisement -

డైనమిక్‌ స్టార్‌ నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ బ్యానర్స్‌పై మ‌హేష్ కొనేరు స‌మ‌ర్ప‌ణ‌లో జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్‌కుమార్ వ‌ట్టికూటి నిర్మాత‌లుగా కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో లాంఛ‌నంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

తొలి సన్నివేశానికి ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, క్రిష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కు అందించారు.

 nandamuri kalyan ram new film starts

నందమూరి కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ – ”మహేష్‌ కొనేరు నా కుటుంబ సభ్యుడితో సమానం. తనతో గత రెండేళ్లుగా కలిసి ప్రయాణిస్తున్నాం. ఈ సినిమా నేను చేయడానికి కారణాల్లో తను ఒకడు. ఇక సినిమా విషయానికి వస్తే, గత 13 సంవత్సరాలుగా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూనే ఉన్నాను.

ఎంత డిఫరెంట్‌ సినిమా చేసినా అందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే ఉన్నాయి. కానీ తొలిసారి జయేంద్రగారి స్క్రిప్ట్‌ విన్న తర్వాత కొత్తగా అనిపించింది. మంచి రొమాంటిక్‌ కామెడి సినిమాలో చేయాలని చాలా రోజులుగా కోరిక ఉండేది. ఈ సినిమాతో కోరిక తీరనుంది. పి.సి.శ్రీరాంగారితో కలిసి పనిచేయడం గౌరవంగా ఉంది. అందరికీ కొత్త కల్యాణ్‌రామ్‌ కనపడతాడని భావిస్తున్నాను. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. అందరినీ అలరించే ఎంటర్‌టైనర్‌ అవుతుందని భావిస్తున్నాను” అన్నారు.

  nandamuri kalyan ram new film starts

చిత్ర స‌మ‌ర్ప‌కుడు మహేష్‌ కొనేరు మాట్లాడుతూ – ”నేను కూడా జర్నలిస్ట్‌నే. పాత్రికేయులతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాను. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.1 ఇది. నిర్మాతగా ఇంకా మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నాను. కల్యాణ్‌రామ్‌గారిని కొత్తగా, ఫ్రెష్‌గా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో ప్రజెంట్‌ చేసే అవకాశం రావడం హ్యాపీ. అవకాశం ఇచ్చినందుకు కల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఏర్కాడ్‌లో స్టార్ట్‌ అవుతుంది. ఆగస్ట్‌ 5 నుండి 7 వరకు అక్కడే షూటింగ్‌ చేస్తాం. తర్వాత ఆగస్ట్‌ 15 నుండి సెప్టెంబర్‌ చివరి వారం వరకు సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

నిర్మాత విజయ్‌కుమార్‌ వట్టికూటి మాట్లాడుతూ – ”సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న వ్యక్తులందరూ ఓ టీమ్‌గా ఏర్పడి చేస్తున్న సినిమా ఇది. కల్యాణ్‌గారి పాజిటివ్‌ ఎనర్జీతో అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. శరత్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందిస్తారని భావిస్తున్నాం. సుభాగారు అద్భుతమైన స్క్రిప్ట్‌ను అందించారు. జయేంద్రగారి విజన్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేపు స్క్రీన్‌పై చూస్తారు. పి.సి.శ్రీరామ్‌ వంటి గొప్ప టెక్నిషియన్‌తో వర్క్‌ చేయడం గౌరవంగా భావిస్తున్నాం” అన్నారు.

దర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ – ”కల్యాణ్‌రామ్‌గారితో రొమాంటిక్‌ మూవీ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. కల్యాణ్‌రామ్‌గారు సరికొత్త మేకోవర్‌లో కనపడతారు. ఆయనతో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఐశ్వర్యలక్ష్మిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌తో జర్నీ చేయడం హ్యాపీగా ఉంది” అన్నారు.
ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అవుతుంది

కిరణ్‌ ముప్పవరపు మాట్లాడుతూ – ”ఈ సినిమాలో అసోసియేషన్‌ కావడం ఆనందంగా ఉంది. జయేంద్రగారు, పి.సి.శ్రీరాంగారితో కలిసి పనిచేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఈ సినిమా స్ట్రయిట్‌ తెలుగు సినిమా. ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమాను అందిస్తామనే నమ్మకం ఉంది” అన్నారు.

  nandamuri kalyan ram new film starts

పి.సి.శ్రీరామ్‌ మాట్లాడుతూ – ”మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.

ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ – ”ఓ మంచి టీంతో కలసి పనిచేయడం సంతోషంగా ఉంది. పి.సి.శ్రీరాం వంటి గొప్ప టెక్నిషియన్‌తో కలిసి సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది”
అన్నారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌, ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఒః వంశీ కాకా, ఆర్ట్‌: సెల్వకుమార్‌, ఎడిటర్‌: టి.ఎస్‌.సురేష్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:సి.కమల్‌ కన్నన్‌, యాక్షన్‌: విజయ్‌, మాటలు: జయేంద్ర, సుభా, మీరాగ్‌, కథ, కథనం: జయేంద్ర, సుభా, సంగీతం: శరత్‌, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌, స‌మ‌ర్ప‌ణః మ‌హేష్ కొనేరు, నిర్మాతలు: కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి, దర్శకత్వం: జయేంద్ర.

- Advertisement -