నివేదా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘శ్రీమతి’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఆసక్తికరమైన ఫ్యామిలీ సన్నివేశాలు, ఆకట్టుకునే పాత్రలు, భావోద్వేగాలతో సినిమా కథపై మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నివేదా థామస్ పాత్ర ట్రైలర్లో ఎమోషన్ కట్టిపడేసింది.
పెళ్లి తర్వాత తన భర్త, అత్తింటి వారు ఆశించే విధంగా అణిగిమణిగి ఉండే భార్యగా మారడానికి నివేదా పడే ఇబ్బంది, ఈ క్రమంలో తనలో వచ్చిన మార్పును ట్రైలర్ ఆసక్తికరంగా చూపించారు.
ఈ చిత్రంలో హరితేజ, గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, రాజశ్రీ, ఐశ్వర్య భాస్కరన్, సుదర్శన్, విరాజ్ అశ్విన్, మానిక చిక్కాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ.ఎల్. విశ్వనాథ్ సంగీతం అందిస్తున్నారు.జీ5 సౌత్ ఒరిజినల్‌గా రూపొందిన ‘శ్రీమతి’ డిసెంబర్ 4, 2026 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది.
Also Read:భోగి..గొప్ప సినిమా: శర్వా
నటీనటులు: నివేదా థామస్, తిరువీర్, హరితేజ, గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, రాజశ్రీ, ఐశ్వర్య భాస్కరన్, సుదర్శన్, విరాజ్ అశ్విన్

