BB10: పదకొండో వారం కెప్టెన్‌గా అమన్..

2
Aman Masud
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 10లో పదకొండో వారం డిక్టేటర్ షిప్ ముగిసింది. ఎన్నో మలుపులు, వాదోపవాదాలు, అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్సీ పోరు ఆసక్తికరంగా సాగింది. చివరకు అమన్ తన ఆటతీరుతో సత్తా చాటి ఇంటి కొత్త కెప్టెన్‌గా అవతరించాడు. అంతేకాదు, 13వ వారంలో జరగనున్న టికెట్ టు ఫినాలే పోటీకి తొలి కంటెండర్‌గా కూడా నిలిచాడు.

డే 75…ఎపిసోడ్ 76లో జరిగిన బుద్ధిశాలి, బలశాలి టాస్క్‌తో ఇంట్లో అసలు రచ్చ మొదలైంది. ఈ పోటీలో అమన్, రామ్ ప్రసాద్ తమ శక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే రామ్ ప్రసాద్ ఎక్కువసేపు బరువు మోయలేక మధ్యలోనే తప్పుకోగా, అమన్ మాత్రం చివరి వరకు పోరాడాడు. కానీ సంచాలక్‌గా వ్యవహరించిన ముకేష్ తన టీమ్ సభ్యుడైన రామ్ ప్రసాద్‌కు అనుకూలంగా నిర్ణయం ప్రకటించడం వివాదానికి దారితీసింది. దీనిపై మరో సంచాలక్ వంశీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. చివరకు బిగ్ బాస్ జోక్యంతో ముకేష్ తన నిర్ణయాన్ని మార్చుకుని అమన్‌ను విజేతగా ప్రకటించాడు.

ఈ టాస్క్ తర్వాత గెలిచిన టీమ్‌కు బిర్యానీ, ఓడిన టీమ్‌కు గంజి ఇవ్వడంతో ఇంట్లో మరో ఎమోషనల్ సీన్ కనిపించింది. నరేష్ గంజితో సరిపెట్టుకోవడం చూసి రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు త్రిగుణ్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అనంతరం ఇంటి పనుల విషయంలోనూ రెండు టీమ్‌ల మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయి.

కెప్టెన్సీ పోటీకి ముకేష్ టీమ్ నుంచి నీతూ, ఆర్కే, ముకేష్ ముందుకు రాగా.. స్టడీ అండ్ బ్యాలెన్స్ టాస్కులో నీతూ విజయం సాధించింది. మరోవైపు త్రిగుణ్ టీమ్‌కు లభించిన అడ్వాంటేజ్‌లతో దేబ్జానీ, అమన్, శివ్ పోటీలోకి వచ్చారు. వీరితో పాటు నీతూ కూడా కెప్టెన్సీ రేసులో నిలిచింది.

ALso Read:హనుమాన్ అన్ష్‌ హిట్ కానీ..దర్శకుడు మాత్రం!

పడగొట్టు టాస్కులో అమన్ అద్భుతమైన వేగంతో లక్ష్యాన్ని పూర్తి చేసి అందరికంటే ముందుగా నిలిచాడు. దీంతో పదకొండో వారానికి కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు.

- Advertisement -