నటి సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం: పార్ట్ 1’లో సీత పాత్రలో నటించింది సాయిపల్లవి. అలాగే ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఓఎం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’ చిత్రంలోనూ కనిపించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి ఏఎస్పీ నిత్యారెడ్డి పాత్రను పోషిస్తున్నారు. గతంలో 2024లో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో ఆమె మరోసారి కలిసి పనిచేస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి.. ఈ సినిమాలో సాయి పల్లవిని ఎందుకు ఎంపిక చేసుకున్నారో వెల్లడించారు. సాయి పల్లవి అద్భుతమైన ప్రతిభ ఉన్న నటి… ఎలాంటి పాత్రనైనా ఆమె సమర్థంగా పోషించగలదని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. ఈ సినిమాలో ఓ సీరియస్ మహిళా పాత్రను రాశాను. అందుకే మంచి నటన కనబర్చగలిగే వ్యక్తి కోసం వెతికినప్పుడు నా మొదటి ఎంపిక సాయి పల్లవే. అయితే ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో నా ప్రతిపాదనకు అంగీకరిస్తుందో లేదోనని అనుకున్నాను. కానీ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పింది. స్క్రిప్ట్ చదివిన తర్వాత కొన్ని రోజులకే మరోసారి తన నిర్ణయాన్ని ఖరారు చేసింది అని దర్శకుడు వెల్లడించారు.
సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవిని యోధురాలిగా చూపించారు. కత్తులు, ఆయుధాలు చేతబట్టి రాక్షసులతో పోరాడే యాక్షన్ సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నారు. ఇదే తరహాలో ‘ఓఎం’ సినిమాలోనూ ఏఎస్పీ నిత్యారెడ్డి పాత్రలో సాయి పల్లవి హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో నటించారు.అయితే రామాయణంలోనూ ఆమె యాక్షన్ సన్నివేశాలు చేశారని దర్శకుడు రాజ్‌కుమార్‌కు ముందే తెలుసా? అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
Also Read:ఎల్‌నినో పరిస్థితులు..గ్లోబల్ సమ్మిట్ అవసరమా?
ఆన్లైన్లో సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని తెరవెనుక వీడియోలు చూసే వరకు రామాయణంలో ఆమె యాక్షన్ సన్నివేశాలు చేసిన విషయం నాకు తెలియదు. సాయి పల్లవి కూడా ఈ విషయం గురించి నాతో ఎప్పుడూ చెప్పలేదు. ఆమె రిహార్సల్స్‌కు వచ్చినప్పుడు మంచి డ్యాన్సర్ కావడంతో శరీరంపై అద్భుతమైన నియంత్రణ ఉందని నాకు అర్థమైంది. అందుకే కొరియోగ్రఫీ చేసిన స్టంట్ సన్నివేశాలను కూడా సులభంగా చేయగలదని నమ్మాను. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహాలు లేవు అని తెలిపారు.

