భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లు కొల్పోయి 243 పరుగులు చేసింది. అయితే భారత తుది జట్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
భారత టెస్టు జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగుతున్న సిరాజ్‌ను పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఈ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడానికి సరైన కారణం తనకు అర్థం కావడం లేదన్నారు.
సిరాజ్‌ను వన్డే జట్టులోకి తీసుకున్నప్పుడు చివరి మ్యాచ్‌లో మాత్రమే ఆడించినప్పుడే కొన్ని సంకేతాలు కనిపించాయి. ఆ మ్యాచ్ ఆడించినప్పుడు ఇక్కడ జరిగే టెస్టు కోసం అతడిని సిద్ధం చేస్తున్నారని అనుకున్నాను. కానీ తుది జట్టులో అతడి పేరు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సిరాజ్ ఎప్పుడూ భారత్‌ను నిరాశపర్చలేదు అన్నారు.
Also Read:ఎల్‌నినో పరిస్థితులు..గ్లోబల్ సమ్మిట్ అవసరమా?
అతడి బౌలింగ్‌లో ఎలాంటి లోపాలు కనిపించడం లేదు. మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. మధ్యలో ఆడిన మ్యాచ్‌ల్లోనూ అతడి ప్రదర్శన బాగానే ఉంది. అలాంటప్పుడు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకు తెలియదు. అతడి స్థానంలో ఎంపికైన బౌలర్లు జట్టుకు మంచి ప్రదర్శన అందిస్తారని ఆశిస్తున్నాను” అని గవాస్కర్ పేర్కొన్నారు.

