నామినేషన్స్‌లో హైడ్రామా..నరేష్ తప్ప!

2
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదకొండో వారం నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. ఈసారి డిక్టేటర్స్ థీమ్‌లో భాగంగా గత సీజన్లకు చెందిన మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దించిన బిగ్ బాస్.. వారి చేత నామినేషన్లు చేయించాడు. మంగళవారం ఎపిసోడ్‌లో శ్రిష్టి, చరణ్, చైత్ర, శ్వేత ఇంట్లోకి వచ్చి కంటెస్టెంట్లను టార్గెట్ చేశారు. మాటల యుద్ధాలు, వ్యక్తిగత విమర్శలు, పాత గొడవలతో ఇల్లు ఒక్కసారిగా వేడెక్కింది.

ముందుగా ఝాన్సీ చేసిన వ్యాఖ్యలతో సుధీర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో దేబ్జానీ, త్రిగుణ్ అతడికి ధైర్యం చెప్పారు. ఇతరుల మాటలను మనసుకు తీసుకోవద్దని, తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయాలని సూచించారు.

అనంతరం వచ్చిన శ్రిష్టి.. వర్షిణి ఆటతీరును తీవ్రంగా విమర్శించింది. ఫిజికల్ టాస్కుల్లో సరిగా ఆడటం లేదని, గెలిచిన సందర్భాలు కూడా లేవని ప్రశ్నించింది. మరోవైపు త్రిగుణ్‌కు డ్యాగర్ ఇవ్వడంతో అతడు ముకేష్‌ను నామినేట్ చేశాడు. ఇతరుల ఓటమిలో ఆనందం వెతుక్కుంటున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత చైత్ర.. వంశీని పప్పెట్ అంటూ విమర్శిస్తూ నామినేట్ చేసింది. తన డ్యాగర్‌ను వర్షిణికి ఇవ్వగా, ఆమె అమన్‌ను టార్గెట్ చేసింది. హెడ్ కౌంట్ టాస్క్‌లో తన మద్దతును తప్పుగా అర్థం చేసుకున్నాడని ఆరోపించింది.

ఇక చరణ్ ఎంట్రీతో మరోసారి వాదనలు మొదలయ్యాయి. సుధీర్‌ను నామినేట్ చేస్తూ అతడి ఆటలో స్పష్టత లేదని విమర్శించాడు. అనంతరం డ్యాగర్‌ను రామ్ ప్రసాద్‌కు ఇవ్వగా, అతడు శివ్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్వేత.. రామ్ ప్రసాద్‌ను కన్నింగ్ అంటూ నామినేషన్‌లోకి నెట్టింది. అమన్‌కు డ్యాగర్ ఇవ్వడంతో అతడు త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు.

Also Read:పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా షేన్ డీట్జ్

చివరగా కెప్టెన్ నరేష్‌కు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో శివ్, ఆర్కేలను ఎంపిక చేశాడు. ఆర్కే తనకు అప్పగించిన పనులు చేయడం లేదని కారణం చెప్పాడు. ఈ క్రమంలో త్రిగుణ్‌తో ఆర్కేకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటలు ముదిరి ఇతర కంటెస్టెంట్లు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది.ఇలా పదకొండో వారం నామినేషన్స్‌లో కెప్టెన్ నరేష్ మినహా మిగిలిన కంటెస్టెంట్లందరూ నిలిచారు.

- Advertisement -