పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన షేన్ డీట్జ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వెస్టిండీస్ మహిళల జట్టు హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన డీట్జ్.. ఇప్పుడు పాకిస్థాన్ జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన వహాబ్ రియాజ్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
గత ఏడాది నవంబర్‌లో మహమ్మద్ వసీం ఈ పదవి నుంచి తప్పుకున్న తర్వాత వహాబ్ రియాజ్ వివిధ హోదాల్లో జట్టుకు సేవలందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీలో ఆయన జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఇప్పటివరకు ఆడిన నాలుగు గ్రూప్ మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించింది.
అయితే ఈ ఏడాది పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు 33 మ్యాచ్‌లు ఆడి 15 విజయాలు మాత్రమే సాధించింది. సొంతగడ్డపై జింబాబ్వేతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆరు విజయాలు నమోదు చేసింది. మరోవైపు దక్షిణాఫ్రికా, శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లను 2-1 తేడాతో కోల్పోయింది. టీ20 ప్రపంచకప్‌లోనూ ఒక్క విజయం మాత్రమే సాధించింది. ప్రపంచకప్‌కు ముందు జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆసియా కప్‌లో సెమీఫైనల్‌కు చేరగా, ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది.
గత నాలుగేళ్లలో పాకిస్థాన్ మహిళల జట్టుకు పూర్తి స్థాయి లేదా తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడో వ్యక్తి షేన్ డీట్జ్ కావడం విశేషం. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు ముందు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సిరీస్ కోసం కరేబియన్ దీవుల్లోనే జట్టుతో కలవనున్నారు.
Also Read:ఆ పాదయాత్ర ఓ గొప్ప జ్ఞాపకం..కేటీఆర్!
వెస్టిండీస్ మహిళల జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో డీట్జ్ ఆ జట్టును 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లలో వరుసగా సెమీఫైనల్స్‌కు చేర్చారు. అంతకుముందు 2008 నుంచి 2013 వరకు న్యూజిలాండ్‌లోని క్రికెట్ వెల్లింగ్టన్‌కు హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా పనిచేశారు. అనంతరం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జాతీయ జట్లకు కూడా హెడ్ కోచ్‌గా సేవలందించారు.

