హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో భూ కూల్చివేతలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని సర్వే నంబర్ 626/2ఏలో ఉన్న తమ భూమికి సంబంధించి 2024లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా తమ భూమిపై కూల్చివేతలు జరిపించారని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు సంబంధిత తహసీల్దార్‌ను న్యాయస్థానం ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు.
Also Read:ఆ పాదయాత్ర ఓ గొప్ప జ్ఞాపకం..కేటీఆర్!

