డీలిమిటేషన్ బిల్లుపైనే అమిత్‌ షా దృష్టి..జైరాం ఆరోపణలు

2
- Advertisement -

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన 82 రోజులైనా ఇప్పటికీ అధికారికంగా ముగింపు (ప్రొరోగేషన్) ప్రకటించకపోవడంపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో పోస్టు చేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 82 రోజులు గడిచినా ఇంకా ఎందుకు ముగింపు ప్రకటించలేదని జైరాం రమేశ్ ప్రశ్నించారు. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీని సమకూర్చుకుని డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్ర హోంమంత్రి ఉన్నారని ఆరోపించారు.

ఈ బిల్లుల్లో ఏముందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదని, అయితే 2029 ఎన్నికల్లో ఎదురుకాబోయే పరాజయం నుంచి బీజేపీని కాపాడటమే వాటి అసలు ఉద్దేశమని విమర్శించారు. అమిత్ షా బూటకపు మాటలు, గొప్పలు చెప్పడంలో ఆరితేరిన వ్యక్తి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్..

ఓట్ల చోరీపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమని అమిత్ షా చెబుతున్నారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. అయితే గతేడాది ప్రతిపక్షాలన్నీ కలిసి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై చర్చ కోరినప్పుడు.. అది ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని చెప్పి అమిత్ షా తిరస్కరించారని విమర్శించారు.

ఓట్ల చోరీపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే విషయంలో కేంద్ర హోంమంత్రి నిజంగా చిత్తశుద్ధితో ఉంటే.. ముందుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -