ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలోనూ 14 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన 38 ఏళ్ల మ్యాక్స్‌వెల్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు.
దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే మ్యాక్స్‌వెల్.. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. 2012 ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మొత్తం 149 వన్డేలు ఆడి 3,990 పరుగులు చేశాడు. ఇందులో 201 పరుగులు అతడి అత్యధిక స్కోరు. బౌలింగ్‌లో 77 వికెట్లు పడగొట్టాడు.
2012 సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున 130 టీ20లు ఆడి 2,897 పరుగులు సాధించాడు. ఇందులో 145 పరుగులు అత్యధిక స్కోరు. బౌలింగ్‌లో 51 వికెట్లు తీశాడు. 10 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం అతడి అత్యుత్తమ ప్రదర్శన.
Also Read:రాహుల్ కోసమే RR ట్యాక్స్:అమిత్ షా
2013లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి ప్రవేశించిన మ్యాక్స్‌వెల్.. ఆస్ట్రేలియా తరఫున ఏడు టెస్టులు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో భారత్‌పైనే 104 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు.

