రాహుల్ గాంధీ భావోద్వేగ పోస్ట్

3
- Advertisement -

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

నీ ఒడిలో కూర్చొని, నీ రెండు చేతులను పట్టుకుని, నువ్వు చెప్పిన మాటలను వింటూ, వాటినే నేను కూడా పలుకుతున్న ఆ క్షణం గుర్తుకొస్తోంది. అసతో మా సద్గమయ.. తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయ.. ఓం శాంతి.. శాంతి.. శాంతిః అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

నానమ్మా.. నువ్వు నాకు ఇచ్చిన బహుమతి ఎంత అందమైనది. అలాంటి బహుమతి నాకు లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు అంటూ తన భావాలను పంచుకున్నారు.

- Advertisement -