తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా?

5
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సుమన్..పెన్‌గంగా ప్రాజెక్టు వద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మించి ముంబై సరిహద్దుల వరకు నీళ్లు తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది..అలా చేస్తే మనకు నీళ్లు రావు, మరి దాని గురించి నిన్న చర్చించారా లేదా?..ఇరిగేషన్ మంత్రి, అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నాయకుల భూముల దగ్గరికి కాదు..రైతుల భూముల దగ్గరికి వెళ్ళి చూడండి…కరెంట్ మంచిగా ఇస్తున్నామని చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడు కదా కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి రైతుల భూముల దగ్గరికి వెళ్ళి అడగండి కరెంట్ వస్తుందా లేదా అని వాళ్ళే సమాధానం చెప్తారు అన్నారు.

Also Read:ఆర్నబ్ తుపాన్..ఏపీకి భారీ ముప్పు!

కాంగ్రెస్ తెచ్చిన కరువు వెనక బీజేపీ కూడా ఉంది ..2023 లో బీజేపీ ఆగమేఘాల మీద మేడిగడ్డకు NDSA రిపోర్ట్ పంపించింది..మరి ఇప్పుడు ఎందుకు మేడిగడ్డను పట్టించుకోవడంలేదు?..ధైర్యం చెప్పాల్సిన నాయకుడు వరి పంటలు వేసుకోకండి అని ప్రజలను బయపెడుతున్నాడు..విత్తనాలు అమ్మడంలేదు..కరోనా టైంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సగంమంది జనాలు చనిపోయి ఉండేవాళ్లని ప్రజలు విమర్శిస్తున్నారు అన్నారు.

- Advertisement -