నీటి కోసం రైతుల పాదయాత్ర

2
- Advertisement -

నీళ్ల కోసం వట్టిపోయిన పెద్దవాగులో రైతులు పాదయాత్ర చేపట్టారు. శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తిపోయని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా పెద్దవాగు ఎండిపోయింది. పెద్దవాగులో కృష్ణా జలాలు పారించాలని దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

పెద్దవాగులో కృష్ణా జలాలు పారించిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కుతుంది అన్నారు. వట్టిపోయిన వాగుకు నదీ జలాలు తీసుకొచ్చి జీవం పోసింది కేసీఆర్… కరువుతో అల్లాడిన దేవరకద్ర నియోజకవర్గంలో చెక్‌డ్యామ్‌లు నిర్మించి వేల ఎకరాలను సస్యశ్యామలం చేశాం అన్నారు.

కందూరు పెద్దవాగులోకి నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తున్నాం.ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. 2014 కంటే ముందు పెద్దవాగు పూర్తిగా ఎండిపోయింది. కృష్ణా నీళ్లను పెద్దవాగులో పారించి.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి వాగుకు జీవం పోశాం. పదేళ్లపాటు వాగు కళకళలాడింది. మార్చి వరకు చెక్‌డ్యామ్‌లలో నీళ్లు ఉండేవి. 36 చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే రెండు కిలోమీటర్ల మేర బోర్లు రీఛార్జ్ అయ్యాయి. వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యాయి అన్నారు.

ఇప్పుడున్న ఎమ్మెల్యేకు పెద్దవాగులోకి నీళ్లు ఎట్లా వస్తాయో తెల్వదు. శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తిపోయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యుత్ సరఫరా లేక కల్వకుర్తి మోటర్లు నడవడం లేదు. కరువు పరిస్థితుల్లో కృష్ణా నీళ్లను ఒడిసిపట్టకుండా చోద్యం చూస్తుంది. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ రైతులకు ఉపయోగం లేదు.

Also Read:చంద్ర‌బాబుది క్రిమిన‌ల్ మెంటాలిటీ

పెద్దవాగు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఏపీ రాష్ట్రం కృష్ణా నీళ్లను 700 కిలోమీటర్ల దూరం తరలిస్తుంది. మన జిల్లా నుంచి కృష్ణా నది పారుతున్నా.. మన పంటలు ఎండిపోతున్నాయి. పెద్దవాగును ఎండబెట్టి ఇసుక దోపిడీకి తెరలేపారు. ఇసుక మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వానాకాలంలోనే చెక్‌డ్యామ్‌లు ఎండిపోయాయి అన్నారు.

- Advertisement -