గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పుట్టినరోజు సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని పార్టీ ఆఫీస్ లో మొక్కలు నాటారు MLA వివేకానంద గౌడ్. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పుట్టినరోజు సందర్బంగా మొక్కను నాటడం చాలా అనందంగా ఉంది అన్నారు.
మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కోరారు. వృక్షాలను కాపాడుకుంటేనే మన నియోజకవర్గం లో కాలుష్య రహిత వాతావరణం తో ఆరోగ్యంగా ఉంటాము అన్నారు.
Also Read:ఏపీ లోకల్‌బాడీ పోల్స్..సుప్రీం కీ ఆదేశాలు
ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

