జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రష్మికి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కరలేదు. ఎందుకంటే వారి యాంకరింగ్ కంటే వారి అందంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక అనసూయ సంగతి పక్కనుంచితే రశ్మీకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఆదివారం ఓ చానళ షోలో పాల్గొన్న రష్మీ తన వ్యక్తిగత విషయాల గురించిన కొన్ని విషయాలని బయటపెట్టింది. ఈ షోకి తన స్నేహితుడు రేవంత్ తో కలసి వచ్చింది. వీరిద్దరిది వైజాగ్. ఈ షోలో ఓ రౌండ్ లో నిజాలు చెప్పాలి. నిజం చెబుతానని ముందే చెప్పాలి. అందుకు తగ్గట్లుగానే వారికీ ఇచ్చిన జ్యూస్ తాగాలి.
ఇలా నిజం చెబుతానని జ్యూస్ తాగిన రష్మిని యాంకర్ రానా ఓ ప్రశ్న అడిగాడు. మొదటి ముద్దు ఎప్పుడు పెట్టుకున్నారని అడిగారు? వెంటనే సిగ్గుపడిన రష్మి సమాధానం చెప్పేందుకు సిగ్గుపడింది. కానీ రానా, రేవంత్ పట్టుబట్టారు. దీంతో సీక్రెట్ రివిల్ చేసింది రష్మి. తాను 14 ఏళ్ల ఏజ్‌లోనే ఫస్ట్ కిస్ పెట్టుకున్నట్లు చెప్పింది. ఎవరిని అని అడిగితే మాత్రం సమాధానం దాటవేసింది. ఆ విషయాన్ని ఇప్పుడే చెప్పను అంటూ తప్పించుకుంది. మొత్తానికి ఈ జబర్దస్త్ భామ ఆ వయసులోనే అంత ఫాస్ట్ అన్నమాట.
బుల్లితెరపై రాణిస్తున్న రష్మీ.. వెండితెరపై బిజీ అయిపోయేందుకు ట్రై చేస్తోంది. ఇప్పటికే గుంటూరు టాకీస్ తో ప్రేక్షకులను హీటెక్కించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా తన పర్సనల్ విషయం బయటపెట్డటంతో అది హాట్ టాపిక్ గా మారింది.